జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం బిడేకన్నె గ్రామంలో ధరణి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 146 పంది రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు… ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
పైసా ఖర్చు లేకుండా మీ ఊర్లోనే ‘మీ సేవా’ కేంద్రం పెట్టి పెండింగ్ పాసు పుస్తకాల పనులను పూర్తిచేసిన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.ఇక్కడ సర్పంచ్ , రైతులు నా వద్దకు వచ్చి ఇక్కడి భూమి ఉండి పాస పుస్తకాలు లేవు అని వారి సమస్య చెప్పినప్పుడు నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరడం జరిగిందన్నారు.
చెప్పిన విధంగానే మీ సమస్య పరిష్కరించి ఈరోజు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉంది.216 ఎకరాల 20 గుంటల భూమికి పాస్ పుస్తకాలు ఈరోజు పంపిణీ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. 146 మంది రైతులకు ధరణి వల్ల వచ్చిన సమస్యలు పరిష్కరించడం జరిగింది.ఇంకా ఎవరైనా పాస్ పుస్తకాలు లేని రైతులు మిగిలిపోయి ఉంటే,వారి సమస్యను కూడా త్వరలోనే తీర్చాలని కలెక్టర్ శరత్ కు ఆదేశించారని హరీష్ రావు. గత ప్రభుత్వాలు ఏ రైతును పట్టించుకోలేదు. రైతు పంటకు పెట్టుబడి సాయం చేయలేదు. రైతు చనిపోతే ఏ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయలేదు, కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పైరవీ లేకుండానే రైతుకు పెట్టుబడికి రైతుబంధు, రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చి కుటుంబాన్ని ఆదుకుంటున్నారని గుర్తు చేశారు.