ప్రభుత్వ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించే విధివిధానాలు ఖరారు అయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ మినహాయించి 32 జిల్లాలో ఉన్న ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం బదలాయింపు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో తమ జిల్లా కాకుండా వేరే జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలోని తమ లేదా మరో జిల్లా ను పెంచుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా గా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న భార్య భర్తలు, దివ్యాంగులు, కారుణ్య నియామకాలలోని వారికి ఐచ్ఛికాలు ఇచ్చి స్థానం కల్పిస్తారు.
ఈ బదలాయింపు లకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సి ఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంతో మంది ఉద్యోగులు తమ సొంత ప్రాంతం లో కాకుండా ఉమ్మడి జిల్లాలోని ఇతర జిల్లాలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో ఎవరి జిల్లాలో వారికి ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇకనుండి ఉద్యోగులు సొంత జిల్లాలో విధులు నిర్వహించే అవకాశం ఉంది.