అడవుల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. జంతువులను వేటాడటం, వాటి మాంసాన్ని అమ్మడం. అదేవిధంగా చెట్లను నరకడం, స్మగ్లింగ్.. కలప అక్రమ రవాణా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరాలను అరికట్టడానికి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం తెలంగాణ లో పులుల సంఖ్య కూడా పెరుగుతుంది. దాంతో దుండగులు పులులను వేటాడి హత మారుస్తున్నారు. వాటి చర్మం గోర్లను అమ్మి క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.
అంతేకాకుండా అటవీ శాఖ అధికారులపై కూడా దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల భూపాల్ పళ్లి అడవుల్లో దుండగులు పులిని హతమార్చి చర్మం, గేట్లను వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవుల్లో నేరాలకు పాల్పడుతున్న వారి సమాచారం అందించే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రహస్య సమాచార నిధి కింద రూ. 4.5 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేరాల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంది.