సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. నాలుగు గురుకుల సొసైటీలో 9,096 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేస్తూ నియామక బాధ్యతను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టిఆర్ఈఐ-ఆర్ బి) కు బాధ్యతలు అప్పగించింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు తదితర పూర్తి సమాచారంతో కూడిన ప్రతిపాదనలను సంక్షేమ గురుకుల సొసైటీలు తాజాగా తయారు చేశాయి. ప్రతిపాదనల తయారీలో ప్రధానంగా నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగ కేటాయింపుల అంశం కాస్త జాప్యం కావడంతో ప్రతిపాదనల రూపకల్పన సైతం కాస్త పెండింగ్ లో పడింది. తాజాగా జిఓ 317 ప్రకారం అన్ని గురుకుల సొసైటీలో ఉద్యోగ కేటాయింపులు పూర్తికాగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.