యూపీ ఎన్నికల్లో తెలంగాణ మహిళ సత్తా.. జడ్పీ చైర్ పర్సన్‌గా విజయం

-

యూపీ: ఇటీవల కాలంలో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. విశేషమేంటంటే.. ఇక్కడ జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ మహిళ సత్తా చాటింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి జాన్పూర్ జడ్పీ చైర్ పర్సన్‌గా గెలుపొందారు. శ్రీకళారెడ్డి గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అంతేకాదు ఆమె తండ్రి కీసర జితేందర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే. కొంతకాలం క్రితం యూపీకి చెందిన వ్యక్తితో వివాహం కావడంతో శ్రీ కళారెడ్డి అక్కడికి వెళ్లిపోయారు.

అనంతరం బీజేపీలో చేరి ప్రజా సేవలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. దీంతో ఆమె అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. శ్రీకళారెడ్డి యూపీ ఎన్నికల్లో గెలవడంపై ఆమె స్వగ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ మహిళ యూపీ రాజకీయాల్లో సత్తాచాటడంపై ఆమె కుటుంబసభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకళారెడ్డి తండ్రి స్పూర్తితో చిన్ననాటి నుంచే సేవాగుణం కలిగి ఉండేదని, స్థానికంగా కూడా ఆమె చాలా సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఆ స్పూర్తితోనే యూపీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆమె విజయం సాధించారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version