తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల 24 గంటల కరెంటు సరఫరా జరిగింది. ఇక్కడ కూడా గత పది సంవత్సరాల కాలంలో కరెంటు కోతలు లేకుండా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి వేసిన రైతులకు కరెంటు సరఫరా 24 గంటలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే వ్యవసాయదారుల విషయం పక్కకు పెడితే… తాజాగా కరెంటు కోతలు హైదరాబాదులో కూడా మొదలుకానున్నాయి. నేటి నుంచే హైదరాబాద్‌లో రెండు గంటలు కరెంట్ కోతలు ప్రారంభం అవుతాయి. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఏరియాల పరంగా 2 గంటల కరెంట్ కోతలు ఉంటాయని తెలిపారు అధికారులు. ఇవాళ అంటే జనవరి 17వ తేదీన కరెంట్ కోతల షెడ్యూల్ విడుదల కూడా విడుదల కానుంది.దీంతో హైదరాబాద్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.