బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు

-

నిత్యం ఏదో ఓ కాంట్రవర్సీ కామెంట్‌తో వివాదంలో చిక్కుకునే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే పోలీసులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండడంతో పలువురి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు రెచ్చిపోతున్నారని.. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులను అయినా వదలేది లేదని..ఖబర్ధార్ మిత్తితో సహా చెల్లిస్తామని గత నెల రోజుల కిందట  హెచ్చరించారు.

తాజాగా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  మరో కేసు నమోదు అయింది. ఏప్రిల్ 30న ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారని ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. కాంగ్రెస్ నేత సదయ్య ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసారి గెలవకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చేసిన వ్యాఖ్యలకు ఈసీ కౌశిక్ రెడ్డిని హెచ్చరించిన విషయం విధితమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version