మునుగోడు ప్రజా దీవెన సభకు భారీ బందోబస్తు

-

మునుగోడు ప్రజా దీవెన బహిరంగ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మునుగోడులో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో మర్రిగూడ మండలం చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల ముంపు గ్రామాల బాధితులను ముందస్తుగా అరెస్టులు చేశారు పోలీసులు. గత ఐదు రోజులుగా మర్రిగూడ మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు భూ నిర్వాసితులు. అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో దీక్ష చేస్తున్న 80 మంది వరకు భూనిర్వాసితులను అరెస్టు చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో తమ హక్కుల కోసం నిరసన తెలియజేస్తుంటే సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ నిర్వాసితులు మండిపడుతున్నారు.

మునుగోడు సీఎం సభను అడ్డుకొని తీరతామంటూ భూ నిర్వాసితులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 1300 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజి కమలహాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 23 మంది డిఎస్పీలు, 50 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు, ఇతర సిబ్బంది ఏఎస్ఐలు, కానిస్టేబుల్ లతో పాటు 8 స్పెషల్ పార్టీ బృందాలు, నాలుగు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసులతో సీఎం సభకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news