BREAKING : బీజేపీకి రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ రాజీనామా…టీఆర్‌ఎస్‌ లోకి జంప్‌

-

BREAKING : బీజేపీకి బిగ్‌ షాక్‌ ఇచ్చారు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌. బీజేపీ పార్టీకి కాసేపటి క్రితమే… రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా లేఖ పంపారు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌. ఇక ఇవాళ లేక రేపు టీఆర్ఎస్‌లో చేరనున్నారు ఆనంద్‌ భాస్కర్‌.

కాగా.. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్ ఆదివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అభినందించారు. తాను బీజేపీకి రాజీనామా చేసి టీ(బీ).ఆర్‌.ఎస్ లో చేరుతాన‌ని సీఎం కేసీఆర్ తో చెప్పారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అద్భుతంగా ఉన్నాయ‌ని ఆనంద భాస్క‌ర్ కొనియాడారు. భారత రాష్ట్ర స‌మితి ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news