BREAKING : లోన్ ఆప్ వేధింపులకు మరో వ్యక్తి బలి.. భార్య అశ్లీల ఫోటోలతో !

-

ఆన్ లైన్ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా లోన్ యాప్స్ వేదింపులకు మరొకరు బలి అయ్యారు. లోన్ యాప్స్ వేదింపులతో ఫైర్ మెన్ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు ఫైర్ మెన్ సుధాకర్.
గోల్డెన్ రూపీ యాప్ ద్వారా ఆరువేల రుణం తీసుకున్న సుధాకర్.. గోల్డెన్ రూపీ లోన్ యాప్ ఏంజట్ల నుంచి గత కొంత కాలంగా వేదింపులకు గురవుతున్నాడు.

భార్య అశ్లీల ఫోటోలు పోర్న్ యాప్ లో పెట్టమని అవమానించిన ఏజంట్లు.. దారుణమైన భూతులతో చిత్ర హింసలు చేశారు. సుధాకర్ బందువులు, స్నేహితులకు అసభ్యకరంగా మెస్సేజ్ లు పంపారు గోల్డెన్ రూపీ లోన్ యాప్ ఏంజట్లు. ఇక గోల్డెన్ రూపీ లోన్ యాప్ ఏంజట్ల వేదింపులు తట్టులేక సూసైడ్ చేసుకుంటున్నాని అన్నకు ఫోన్ చేశాడు ఫైర్ మెన్ సుధాకర్. ఆ తర్వాత రైల్వే ట్రాక్ పై శవమై తేలాడు సుధాకర్. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news