ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట విద్యుత్ శాఖ ఏఈ

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యాడు. అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అశ్వరావుపేట మండల పరిధిలోని మద్దికొండ గ్రామంలో కొనకళ్ల ఆదిత్య అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేశాడు ఏఈ శరత్. దీంతో రైతు ఆదిత్య ఏసీబీని ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అశ్వారావుపేట సబ్ స్టేషన్ లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్లితే.. ఏపీలోని జంగారెడ్డిగూడెం కు చెందిన కొనకళ్ల జనార్దన్ రావుకు అశ్వారావుపేట ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల మండలంలోని మద్దికొండ గ్రామంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో హై టెన్షన్ విద్యుత్తు లైన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు జనార్దన్ రావు కుమారుడు ఆదిత్య విద్యుత్ శాఖ ఏఈ ధారావత్ శరత్ ను సంప్రదించాడు. ఇందుకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని.. రూ. లక్ష 81 వేలు చలానా తీయాలని సూచించారు. ఇదే పని నిమిత్తం అనధికారంగా రూ. లక్ష లంచం ఇవ్వాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కొనకళ్ల ఆదిత్య ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఏఈ దారావత్ శరత్ లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు వారి విధి నిర్వహణలో చేయాల్సిన పనికి లంచం అడిగినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 డయల్ చేసి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ రమేష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version