మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో ఆదివారం సాయంత్రం జరిగిన రెడ్డి సింహ గర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆయనను అడ్డుకున్నారు. దాంతో ఆయన ప్రసంగం ముగించుకొని వెళ్లిపోతున్న సమయంలో ఆయన కాన్వాయ్పై కుర్చీలు, రాళ్లు విసిరేశారు. దీంతో రెడ్ల సింహ గర్జన సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దాంతో పోలీసులు దాడి చేసిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా నిర్వహించిన ఈ సభలో రెడ్ల ఐకాస నేతలతోపాటు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా ఈ గందరగోళం నెలకొంది.