ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో ఆయుధాలు సమకూర్చిన నేపాల్ వ్యక్తులపై పోలీసుల ఆరా

-

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం జరిగిన సంఘటన తెలిసిందే. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని వేమూరి ఎన్క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండడాని గమనించిన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు మక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు.

నిందితుడి వద్ద నుండి ఓ తుపాకీ, కత్తి స్వాధీనం చేసుకున్నారు. జీవన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రసాద్ గౌడ్ తో పాటు, A2 గా అతడి భార్య లావణ్య గౌడ్ ను చేర్చారు బంజారా హిల్స్ పోలీసులు. ఐపీసీ సెక్షన్ 452, 307, 120 (b) మరియు 25 (1b) సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. మరికొంతమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసాద్ గౌడ్ కు ఆయుధాలు సమకూర్చిన నేపాల్ వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news