అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన ఆటో, క్యాబ్‌, లారీ సర్వీసులు

-

తెలంగాణ రాష్ట్రంలోని ప్రయాణికులకు, ఇతర రంగాలకు బిగ్‌ షాక్‌ తగిలింది. నిన్న అర్ధరాత్రి నుంచి పలు వాహనాలు బంద్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజు బంద్‌ పాటించాలని రాష్ట్రంలోని డ్రైవర్ల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌, లారీ సర్వీసులు నిలిచిపోయాయి.

ఫిట్‌ నెస్‌ పత్రాల ఆలస్యానికి రవాణాశాఖ జరిమానా విధించడంపై డ్రైవర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి  బంద్‌ నుంచి పాటించిన అనంతరం… నేడు ట్రాన్స్‌ పోర్టు భవన్‌ ముట్టడికి డ్రైవర్ల ఐకాస పిలుపునిచ్చింది. కొత్త మోటారు వాహనాల చట్టం కింద ఆలస్యం పై రోజు కు 50 చొప్పున విధిస్తున్న జరిమానాను రద్దు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌, లారీ సర్వీసులు నిలిచిపోయిన నేపథ్యంలో.. హైదరాబాద్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. చూసుకునేందుకు సిద్ధం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news