తెలంగాణలో ఎస్టీ సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ అణగదొక్కుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోదీ సర్కారు ఎస్టీ మహిళను రాష్ట్రపతి చేస్తే.. బీఆర్ఎస్ మాత్రం ఎస్టీ మహిళలను చంపుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఎస్టీ యువతి ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. బీఆర్ఎస్ సర్కారే వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు చేశారు.
దేశ ఆర్థిక శాఖ మంత్రిగా మహిళను నియమించిన ఘనత ప్రధాన మంత్రి మోదీదని బండి సంజయ్ కొనియాడారు. మోదీ కేబినెట్లో 8 మంది మహిళలు ఉన్నారని గుర్తు చేశారు. మోదీ సర్కార్ మహిళలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. హైదరాబాద్లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం ఈ సమావేశాల్లో ప్రసంగిస్తూ బీజేపీ సర్కార్ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందని వివరించారు.