కేంద్రంపై అలిగిన బండి సంజయ్.. కార్యకర్తగా ఉంటానని ప్రకటన !

-

కేంద్ర ప్రభుత్వంపై బండి సంజయ్ అలిగినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తగా ఉంటానని బండి సంజయ్‌ ప్రకటించినట్లు సమాచారం అందుతోంది. కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు బండి సంజయ్ విముఖత చూపిస్తున్నారట.

సాధారణ కార్యకర్తగానే ఉంటానన్న బండి సంజయ్.. హైకమాండ్ చెప్పినా కేబినెట్‌లో చేరేందుకు విముఖత తెలిపారట. అటు కిషన్ రెడ్డి స్థానంలో కేబినెట్‌లో చేరెదెవరు అనే దానిపై కొత్త చర్చ జరుగుతోంది. కాగా.. కేంద్రమంత్రి పదవికి కిషన్‌ రెడ్డి.. రాజీనామా చేయబోతున్నారని సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం లోపు దీనిపై క్లారిటీ రానుందని సమాచారం అందుతోంది.

ఇది ఉండగా, నాలాంటి సాధారణ కార్యకర్తకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు పార్టీ జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు అని నిన్న బండి సంజయ్‌ అన్నారు. నేను మీ అంచనాలకు అనుగుణంగా పనిచేశానని భావిస్తున్నానని తెలిపారు బండి సంజయ్. నేను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందించిన మద్దతు, ప్రేమ, ప్రోత్సాహానికి సెంట్రల్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. ప్రజాసంగ్రామయాత్రలో అడుగడుగునా నన్ను ముక్తకంఠంతో స్వాగతించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news