సిరిసిల్లా నేతన్నల కోసం రూ.500 కోట్ల ఆర్డర్లు ఇవ్వాలి – బండి సంజయ్‌

-

సిరిసిల్లా నేతన్నల కోసం రూ.500 కోట్ల ఆర్డర్లు ఇవ్వాలని రేవంత్‌ సర్కార్‌ ను బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ కార్డుల ద్వారా 25 వేల రూపాయల పరిమితితో ఓపీ (అవుట్ పేషెంట్) సేవలను అందించే ప్రతిపాదనపై కేంద్రం ద్రుష్టికి తీసుకెళతామన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ హెచ్ డి సి )ద్వారా నూలుకు సంబంధించిన సరికొత్త ప్రణాళికపైనా ఎన్నికలయ్యాక కేంద్రంతో చర్చిస్తానని… సిరిసిల్ల కార్మికుల బతుకుల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే విధంగా నావంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.

అట్లాగే పవర్ లూమ్స్ పై నేతన్నలకు ప్రస్తుతం అందుతున్న ఉపాధి ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ద్రుష్టి సారించాలి. ఏటా కనీసం 500 కోట్ల రూపాయల ఉత్పత్తులకు ఆర్డర్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. దీంతోపాటు నేతన్న కుటుంబాల వాస్తవ ఆర్ధిక స్థితిగతులపై సర్వే జరిపి జియో ట్యాగింగ్ చేసి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలనే ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాగితాలకే పరిమితం చేసిందని వివరించారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సర్వే పూర్తి చేయించి నేతన్నలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందేలా నా వంతు క్రుషి చేస్తానని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version