సిట్ నోటీసులపై బండి సంజయ్ రిప్లై..నేను హాజరుకానంటూ ప్రకటన

-

సిట్ నోటీస్ లకు బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. నాకు సిట్ మీద నమ్మకం లేదని.. పార్లమెంట్ సమావేశాలు బిజీగా ఉన్నాను అని ఇప్పటికే తెలిపానని వివరించారు. ఆయన మళ్ళీ నోటీస్ లు ఇచ్చారు… మీ పరిస్థితి ని అర్థం చేసుకోగలను అన్నారు. ఆ బాధ్యత గల మంత్రి ఇద్దరు మాత్రమే ఉన్నారు అని అన్నారు.. లీక్ లో చాలా మంది ఉన్నారని సిట్ హెడ్ గా మీకు తెలుసని చెప్పారు.

స్కాం ను తక్కువ చేసి చుపెట్టే ప్రయత్నం మొదటి నుండి జరుగుతుంది.. రాజకీయాల ను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షి తో ఆలోచించండని కోరారు. ఈ స్కాం తో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారని.. ఒక గ్రామం నుండి ఎక్కువ మంది గ్రూప్ వన్ కి సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చిందని పేర్కొన్నారు. దాన్ని ప్రజల ముందు పెట్టాను.. ప్రజా ప్రతినిధి గా వివిధ మార్గాల నుండి సమాచారం వస్తుంది.. ఈ సమయం లో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నానని పేర్కొన్నారు. అసలు విషయం పై విచారణ జరపకుండా.. మీరు నాకు నోటీస్ లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారని ఆగ్రహించారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యం లో నేను హాజరు కావడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news