ప్రజల సొమ్మును దొచుకున్న వారిని మోడీ విడిచిపెట్టడు – బండి సంజయ్

ప్రజల సొమ్మును దొచుకున్న వారిని మోడీ విడిచిపెట్టడని హెచ్చరించాడు బండి సంజయ్. ప్రజలను దోచుకొని అడ్డంగా సంపాదించిన వారిపైన అధికారులు స్పందిస్తారని… ఫిర్యాదులు అందితే తనిఖీ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుందని పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన వారిపై అడ్డగోలుగా విమర్శిస్తున్న నాయకులు సమాధానం చెప్పాలి… తనిఖీలు చేయాలా వద్దా ? అని ప్రశ్నించారు.

అక్రమార్కులపై అధికారులు దాడులు జరిపినప్పుడు పార్టీల కనుగుణంగా మలుచుకొని మాట్లాడడం సరికాదని.. అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదు….ఇది కూడా తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తప్పులు చేయనప్పుడు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చని.. దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని ఫైర్‌ అయ్యారు. పేదలను అక్రమంగా దోచుకున్న వారిని చూసి చూడనట్లు వదిలిపెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదని..న్యాయ నిపుణులతో ఎదురుదాడిపై స్పందించేందుకు సీఎం వ్యవహరిస్తున్న తీరు తప్పు అన్నారు బండి సంజయ్‌.