దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థలను ఏర్పాటు చేస్తే కళ్ళ ముందే బిజెపి ఆస్తులను అమ్మేస్తోందంటూ మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. జీఎస్టీ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు. సామాన్య ప్రజానీకం బ్రతకడానికి వీలు లేకుండా పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబం బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రశ్నిస్తే ఈడి, సిబిఐలను ఉసిగొల్పి జైలు పాలు చేస్తున్నారని అన్నారు.
జెండా పండుగ చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ధరలు పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటిని కంట్రోల్ చేయడానికి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులను పంపి.. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
75 సంవత్సరాల ఆజాధికా అమృత్ మహోత్సవ ఉత్సవాలు చేసుకుంటున్నామంటే కారణం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కార్యకర్తలంతా మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు బట్టి. శాంతియుతంగా చలో రాజ్ భవన్ చేపడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.