ఇండస్ట్రీ హిట్ సినిమాలకు నో చెప్పిన షారుఖ్ ఖాన్.. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ ..!

-

హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే సినిమాలు..మరీ ముఖ్యంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలు వస్తున్నాయంటే చాలు.. జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఆయన, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ త్వరలో విడుదల కానుంది. రికార్డుల వేటలో ఇది ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆమిర్ ఖాన్ చేసిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఆయనకు షారుఖ్ ఖాన్ వల్లే వచ్చాయట. అదెలాగో తెలుసుకుందాం.

బాలీవుడ్ బాద్ షా గా పేరు గాంచిన షారుఖ్ ఖాన్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం ప్యారలల్ గా ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కాగా, షారుఖ్ ఖాన్ వలన నాలుగు సూపర్ హిట్ ఫిల్మ్స్ ఆమిర్ ఖాన్ వద్దకు వెళ్లాయట. ఇక ఆమిర్ ఖాన్ నటించడం వలన ఆ పిక్చర్స్ ఇండస్ట్రీ హిట్స్ అయిపోయారు. ఆ చిత్రాలు ఏమిటంటే.. ‘3 ఇడియట్స్’, ‘తారే జమీన్ పర్’, ‘లగాన్’, ‘రంగ్ దే బసంతీ’.

ఈ నాలుగు చిత్రాలు తొలుత షారుఖ్ ఖాన్ తో చేయాలని మేకర్స్ ప్రయత్నించారట. కానీ, షారుఖ్ ఖాన్ నో చెప్పడంతో ఆ సినిమాలు ఆమిర్ ఖాన్ వద్దకు వచ్చాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ‘3 ఇడియట్స్’ లో లీడ్ రోల్ ప్లే చేయాలని తొలుత షారుఖ్ ఖాన్ ను అడిగారట. కానీ, ఆ పాత్ర తనకు నచ్చలేదని బాద్ షా షారుఖ్ అన్నారట. అలా ఆ సినిమా ఆమిర్ ఖాన్ వద్దకు వచ్చింది. షారుఖ్-రాజ్ కుమార్ హిరానీ కాంబోలో త్వరలో ‘డంకీ’ పిక్చర్ రానుంది.

‘తారే జమీన్ పర్’ పిక్చర్ స్టోరిని తొలుత షారుఖ్ ఖాన్ కు వినిపించగా, ఆయనకు నచ్చలేదట. అలా ఆ ఫిల్మ్ స్టోరి ఆమిర్ ఖాన్ వద్దకు రాగా, ఆయన ఆ పిక్చర్ కు ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా వ్యవహరించి బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు.

 

ఇక ‘లగాన్’ సినిమాను షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఇద్దరూ రిజెక్ట్ చేశారు. కానీ, తర్వాత దర్శకుడు ఆమిర్ ఖాన్ ను ఒప్పించి ఈ మూవీ చేశారు. ఓం ప్రకాశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్ దే బసంతీ’లో ముఖ్యమైన కథానాయకుడి పాత్ర కోసం తొలుత షారుఖ్ ఖాన్ ను అడిగారట. కానీ, ఆయన నో చెప్పడంతో ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో నటించాడు. అలా షారుక్ ఖాన్ వలన ఆమిర్ ఖాన్ నాలుగు సూపర్ హిట్ ఫిల్మ్స్ వచ్చాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news