ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై బిజెపి మిడతల దండులాగా దాడి చేస్తుందని మండిపడ్డారు బట్టి విక్రమార్క. బిజెపి విధానాలు దేశ సమగ్రతకు పెను ప్రమాదంగా మారాయి అన్నారు. బిజెపి రాజకీయాలతో దేశం అల్లకల్లోలం అవుతుందన్నారు. రాజాసింగ్ మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు భట్టి. రాజాసింగ్ ని కట్టడి చేయాలన్నారు. కట్టడి చేయకుంటే జరిగే నష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాజా సింగ్ పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు భట్టి విక్రమార్క.
గతంలో కూడా రాజాసింగ్ దళితుల మీద ఇలాంటి మాటలే మాట్లాడారని.. తినే తిండి మీద కూడా మాట్లాడి అవమానపరిచారని అన్నారు. రాజాసింగ్ సమాజానికి ప్రమాదకారిగా మారాడని అన్నారు బట్టి. బిజెపి రాజ్యాంగబద్ధంగా అతనిపై చర్యలు తీసుకోవాలని.. లేదంటే బిజెపి విధానం కూడా ఇదేనని భావించాల్సి వస్తుందన్నారు. రాజాసింగ్ ఒక్కడే కాదు.. ఏ మతం వారైనా ఇంకో మతం పై కించపరిచేలా మాట్లాడిన కట్టడి చేయాలన్నారు. కొద్దిమంది పరిధికి మించి ప్రవర్తించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మునావర్ ఫరుకి కూడా అలాంటి మాటలు మాట్లాడవద్దని సూచించారు.