BREAKING: హైదరాబాద్ లో భారీ పేలుడు.. స్పాట్ లోనే ఒకరు మృతి

-

బ్రేకింగ్ : హైదరాబాద్ మహానగరంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి లింగంపల్లి రైల్ విహార్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఈ ఘటనలో ఒకరు స్పాట్ లో మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో గాయాల పాలు అయిన వారిని ఆస్పత్రికి తరలించారు అధికారులు.

బాదం మిల్క్ షేక్ కు సంబంధించిన గోడౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం అందుతోంది. గ్యాస్ సిలిండర్ పేలాడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటన విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news