BREAKING: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

రాష్ట్రంలో సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నార్మల్ డెలివరీ చేసిన వైద్య బృందాలకు రూ. 3 వేల చొప్పున ఇన్సెంటివ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నేడు జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాగా మొత్తం ప్రసవాల్లో ఏకంగా 64% సిజేరియన్లు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాగా కరీంనగర్ జిల్లా రికార్డులకు ఎక్కింది.

2021- 22 లో జిల్లాలోని ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కలిపి 22, 302 సిజేరియన్లు అంటే సుమారు 87% జరిగాయి. దాదాపు ప్రతి 28 నిమిషాలకు ఒక సిజేరియన్ జరుగుతోంది. పెద్దపెల్లి, సిరిసిల్ల, జగిత్యాల లోను 80 నుంచి 90% వరకు ప్రశవాలు సిజేరియన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో సిజేరియన్ కోసం రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు.

మన పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలో 30% లోపే జరుగుతుండగా.. మన దగ్గర మాత్రం 62 శాతంగా ఉన్నాయి. నిపుణులేమో సాధారణ పద్ధతిలో జన్మించిన బిడ్డల్లో రోగనిరోధకత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సిజేరియన్లు తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news