BREAKING: కేసినో వివాదంలో మంత్రి మల్లారెడ్డి

-

క్యాసినో కేసు దర్యాప్తులో భాగంగా చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు వారిద్దరితో టచ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా ఈడి అధికారులు మాధవరెడ్డి వాడుతున్న కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. కారు నెంబరు TS ET 10 0444 కాగా 0 లేకుండా కేవలం 444 రాసుకొని వాడుతున్నట్లు, ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిదిగా గుర్తించారు.

ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. మాధవ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని మల్లారెడ్డి చెప్పారు. అది అవుట్ డేటెడ్ స్టిక్కర్ అని, నాకు ఇచ్చిన మూడు స్టిక్కర్స్ నా దగ్గరే ఉన్నాయని తెలిపారు. నేను బయటపడేసిన స్టిక్కర్స్ అతను ఎందుకు వాడుతున్నాడో తెలియదని అన్నారు మల్లారెడ్డి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. మాధవరెడ్డి ఎవరు.. అతని మొహం కూడా తెలియదన్నారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news