కాకినాడ పట్టణంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు ఊహించని షాక్ తగిలింది. కాకినాడ నిర్భందంలోకి కె ఎ పాల్ కాన్వాయ్ వెళ్లింది. తనకు పెద్ద మొత్తంలో డబ్బులివ్వాలని, ఆ డబ్బులు అడిగితే కేఏ పాల్ బెదిరించారని రత్నకుమార్ ఆనే వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ కేఏ పాల్ కార్లను నిర్భందించారు రత్నకుమార్.
ప్రస్తుతం కేఏ పాల్ రెండు కార్లను బంధించారు రత్న కుమార్. కేఏ పాల్ కాన్వాయ్ రెండు కార్లను సీ బి సి ఎన్ సి కాంపౌండ్ కు తరలించారు రత్నకుమార్. దీంతో కేఏ పాల్ అక్కడి నుంచి వెనుదిరిగారని సమాచారం. కాగా.. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఫోకస్ చేశారు. అంతేకాదు.. ఆగస్టులో ఆయన పాదయాత్ర కూడా చేయనున్నారు.