BREAKING: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

-

తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆగస్టు 1 న ఈసెట్ నిర్వహించారు. ఇక జూలై 18 నుంచి 21 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, జూలై 30, 31వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించారు. నేడు ఈ ఫలితాలను జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలో కొద్దిసేపటి క్రితం ఈ ఫలితాలను విడుదల చేశారు. 90.7% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఈసెట్ లో 19,954 మంది విద్యార్థులు క్వాలిఫైడ్ అయ్యారు.

ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ లలో టాప్ ర్యాంకులు ఏపీ విద్యార్థులకే దక్కాయి. ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ – లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి (హైదరాబాద్‌), సెకండ్‌ ర్యాంక్‌ – సాయి దీపిక (శ్రీకాకుళం), థర్డ్ ర్యాంక్‌ – కార్తికేయ (గుంటూరు), అగ్రికల్చర్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ – నేహ (గుంటూరు), సెకండ్‌ ర్యాంక్‌ – రోహిత్‌ (విశాఖ), థర్డ్ ర్యాంక్‌ – తరుణ్‌ (గుంటూరు)

Read more RELATED
Recommended to you

Latest news