మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మీడియా – కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు మొదటగా మేమే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడాము అంటున్నాయని.. వాళ్ళనే క్రెడిట్ తీసుకోనివ్వండని పేర్కొన్నారు. క్రెడిట్ తీసుకునేటప్పుడు, వారందరూ బిల్లుకు మద్దతివ్వాలి, ఓటు వేయాలి మరియు వ్యతిరేకించకూడదని కవిత కోరారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం వెనుక బీఆర్ఎస్ కృషి ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటీవల ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. బలమైన పార్టీల డిమాండ్ వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, మహిళ బిల్లుకు బిఆర్ఎస్ తప్పకుండా మద్దతు ఇస్తుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఒక మంచి అడుగు పడుతుందన్నారు. అదే సమయం లో మోడీకి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.