మీరు పొగుడుతున్నది అయోధ్య ఆలయాన్నా? రాముడినా?: బీఆర్ఎస్ ఎంపీ కేకే

-

బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు రాజ్యసభలో అయోధ్య ఆలయం గురించి మాట్లాడారు. బీజేపీ నేతలు పదే పదే అయోధ్య రామాలయం గురించి మాట్లాడుతున్నారని, వారు ప్రశంసిస్తున్నది రామాలయ వాస్తు సౌందర్యాన్నా లేదంటే రాముడినా? అని ప్రశ్నించారు. హిందుమతాన్ని నచ్చినట్లు అన్వయించుకున్న వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం ఏ మాత్రం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో కేకే మాట్లాడారు.

ఇప్పుడు అధికారపక్షం రామ జన్మభూమి, అయోధ్య ఆలయం గురించి మాట్లాడుతోందని, జనవరి 22కి ముందు కూడా రాముడు మన హృదయాల్లో ఉన్నారని ఎంపీ కేకే గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో రామాలయం ఉందని, ఇప్పుడు రామ మందిరం గురించి ప్రచారం చేస్తూ రాముడిని తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు.

“మీరు రాముడికి పెద్ద మందిరాన్ని నిర్మించారు. అది మన విశ్వాసం. దాన్ని మేమెప్పుడూ సవాల్‌ చేయలేదు. అయితే మీరు దక్షిణాది వారి విశ్వాసాన్ని కూడా సవాల్‌ చేయొద్దు. మేం ద్రవిడులం.. మా సంస్కృతి సంప్రదాయాలను మీరు గుర్తించండి. మేం మతం గురించి ఎప్పుడు మాట్లాడినా జాతి వ్యతిరేకులుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతమాత్రం మంచిదికాదు. నేను హిందువును” అయినప్పటికీ మీరు నన్ను మీపక్కన కూర్చొని భోజనం చేయడానికి అనుమతించడంలేదు. మీరు తాగే నీళ్లను తాకడానికి ఒప్పుకోవడంలేదు. రాజకీయధర్మం పాటించవచ్చు కానీ ధర్మంలోకి రాజకీయం తీసుకురావొద్దు. మెజార్టీలో ఉన్నామన్న పేరుతో ఇతరులను అణచివేయొద్దు’’ అని కేశవరావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version