తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజే.. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. కాగ గత ఏడాది అక్టోబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. గత అక్టొబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్ చేయలేదు. దీంతో ఈ సమావేశాలు కొనసాగింపు గానే ఉన్నాయి. దీంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
కాగ గవర్నర్ ప్రసంగం లేక పోవడం పై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంలో వెనకడుగు వేయడం లేదు. కాగ ఈ సారి బడ్జెట్ ను ప్రజా సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించేలా ఉంటుందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంలో బడ్జెట్ సమావేశాలు వస్తున్న నేపథ్యంలో.. అందరి చూపు ఈ బడ్జెట్ పైనే ఉంది.
కాగ ఈ రోజు ఉదయం 11 : 30 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం అవుతాయి. మొదటి రోజే అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశ పెడుతారు. అలాగే మండలిలో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెడుతారు.