రాజీనామా చేయనంటున్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్

-

హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ పరిధిలో పబ్ కి వెళ్లిన యువతి(17) పై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ రేప్ కేసులో అరెస్టులు మొదలయ్యాయి. ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు,వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని పోలీసులు గత శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిందితులు రహెల్,అహుల్లాఖాన్ ను సిటీ శివారులో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రహేల్ ఖాన్.. బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ మోజాం ఖాన్ కుమారుడు కాగా, అహుల్లాఖాన్..వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు. వీరిద్దరిని పోలీసులు నగర శివారులో అరెస్టు చేశారు. కాగా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మసీవుల్లాను టిఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. అతనితో రాజీనామా చేయించేందుకు హోం మంత్రి మహమూద్ అలీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తాను రాజీనామా చేయనని, తనను పదవి నుంచి తీసేయలేరని మసీవుల్లా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news