ఇటీవల మహిళా పై అత్యాచారం, ఆత్మహత్య ప్రేరణకు పాల్పడ్డాడనే ఆరోపణలపై రైతుబంధువుగా పిలవబడే సామాజిక సేవకుడు చక్రధర్ గౌడ్ ను షామీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విధితమే. తాజాగా శనివారం షామీర్పేట పోలీసులు కోర్టు అనుమతితో చక్రధర్ గౌడ్ ను రెండు రోజులపాటు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం.
శనివారం చర్లపల్లి సెంట్రల్ నుండి చక్రధర్ గౌడ్ ను కస్టడీకి తీసుకొని శామీర్పేట పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. చక్రధర్ గౌడ్ ను గత శనివారం అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. తప్పు చేశానని అంగీకరించడంతో ఆయనని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. నేడు కోర్టు ఆదేశాల మేరకు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు.