BREAKING : నేడు భద్రాచలంలో చంద్రబాబు పర్యటన !

-

పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు తెలుగు దేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇందులో బాగంగానే ఇవా ఉదయం 9 గంటలకు తన నివాసం నుంచి వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లనున్నారు నారా చంద్రబాబు నాయుడు.

వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని శివ కాశీపురం, కుక్కునూరులలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉండనుంది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ లో ముంపు ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ రాత్రికి భద్రాచలంలో చంద్రబాబు బస చేయనున్నారు. రేపు ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news