మాంసాహారులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధరలు

-

మాంస ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. హైదరాబాద్ మహానగరంలో భారీగా చికెన్ రేట్లు తగ్గిపోయాయి. గత వారంలో కిలో చికెన్ ధర 200 రూపాయలకు పైన ఉండేది. కానీ అమాంతం పడిపోయింది. మంగళవారం కొత్త ధరలు ఒకసారి పరిశీలించినట్లయితే…. కిలో చికెన్ ధర 183 రూపాయలు దాటలేదు. విత్ స్కిన్ కిలో చికెన్ ధర 161 రూపాయలుగా నమోదు అయింది.

 

స్కిన్ లెస్ 183 రూపాయలుగా ఉంది. ఫామ్ రేటు 89 రూపాయలుగా ఉన్నట్లు… అధికారులు తెలిపారు. రిటైల్ ధర 111 రూపాయలు ఉంది. అయితే వినాయక చవితి పర్వదినం ఉన్న నేపథ్యంలో… మరో 10 రోజులపాటు… చికెన్ విక్రయాలు ఎక్కువగా జరగకపోవచ్చు అనే నేపథ్యంలో… ధరలు అమాంతం పడిపోయినట్లు చెబుతున్నారు. వినాయక చవితి అయిపోయిన తర్వాత మళ్లీ దసరా సీజను వస్తుందని చెబుతున్నారు. ఆ సమయంలో మళ్ళీ కిలో చికెన్ 200 కు పైగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు, చికెన్ షాప్ ఓనర్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version