కౌలు రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త. తొలిసారి కౌలు రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.10వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
దీంతో వారిలో హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు రైతుబంధు, బీమా వంటి ఏ పథకాలు వీరికి అందడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు ఉండగా వ్యవసాయ భూమిలో 30% వారే సాగు చేస్తున్నారు. మామిడి తోటల రైతుల్లో 80% మంది కౌలుదారులే.
కాగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,22,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలకు 17,238 ఎకరాల్లో నష్టం జరిగినట్టు తేల్చారు. ఈ మేరకు ఆయా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది.