బంజారా, గిరిజనులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. కాసేపటి క్రితమే… బంజారా, గిరిజన భవన్‌ను సీఎం కేసీఆర్..ప్రారంభించారు. ఈ సందర్భంగా బంజారా, గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.
ఇక ఈ కార్యక్రమంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రసంగిస్తానని వివరించారు సీఎం కేసీఆర్. ఇక అంతకు ముందు…పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని.. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదని పేర్కొన్నారు.
మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబళిస్తుందన్నారు. మానవ సంబంధాలనే మంట గలుపుతుంది…జాతి జీవనాడిని కలుషితం చేస్తుందని వెల్లడించారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
Live: CM Sri KCR speaking after inaugurating Kumuram Bheem Adivasi Bhavan in Hyderabad. https://t.co/lG6M8BWqkI
— Telangana CMO (@TelanganaCMO) September 17, 2022