బుధవారం సీఎం కేసీఆర్ బీహార్ కు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బీహార్ టూర్ కి బయలుదేరారు. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్సీ మధుసూదనా చారి, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, జాతీయ రైతు సంఘాల నేతలు, తదితరులు ఉన్నారు.
గల్వాన్ లోయలో చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో మరణించిన అమర జవాన్లకు కేసీఆర్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ బోయగూడా లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన బీహార్ వలస కార్మికులకు కూడా కెసిఆర్ పరిహారం అందించనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో లంచ్ భేటీ లో సీఏం కేసీఆర్ పాల్గొంటారు. జాతీయ రాజకీయాలపై నితీష్ కుమార్ తో కేసిఆర్ చర్చించనున్నారు.