తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలంలో వారు కనబరిచిన ధైర్య సాహసాలను సీఎం స్మరించుకున్నారు.
వివక్షను ఎదురిస్తూ సాగిన నాటి వారి పోరాట స్ఫూర్తి, తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడి వున్నదని సీఎం తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ, తెలంగాణ పోరాట యోధులను సమున్నత రీతిలో స్మరించుకుంటున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. సబ్బండ కులాలు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా నిలిచాయని సీఎం తెలిపారు.