వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్నాయి గ్రూప్ విబేధాలు. వరంగల్ తూర్పు, వర్ధన్నపేటలో పదవుల కోసం కొట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు. వరంగల్ తూర్పులో కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండా సురేఖ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవపడ్డారు.. మంత్రి కొండా సురేఖ ఎన్నికల కోసం ప్రతి డివిజన్‌కు 10 మంది పేర్లు ఇవ్వాలని అడగగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని పాత కాంగ్రెస్ నాయకులు గొడవ చేశారు.
దీంతో రెండు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ నాయకులు గొడవపడ్డారు. అలాగే వర్ధన్నపేటలో కడియం శ్రీహరి, కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముందే పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ పాత నాయకులు, కాంగ్రెస్ కొత్త నాయకులు ఇలా రెండు వర్గాలుగా విడిపోయి కడియం శ్రీహరి, కడియం కావ్య ముందే కొట్టుకున్నారు. ఇలా పాత నాయకులను పట్టించుకోకపోతే కడియం కావ్య ఓడిపోవడం ఖాయమని అన్నారు.