తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తోంది – కిషన్ రెడ్డి

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్ట్ అయిన బిజెపి నేతలను చంచల్గూడా జైలులో పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీకేజీ నిరసనలో బీజేవైఎం నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే విధ్వంసం సృష్టిస్తున్నారని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.

పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. పేపర్ లీకేజీ లో పెద్దల హస్తం ఉందనే ప్రచారం జరుగుతుందని.. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ఘటనలతో యువత ఆక్రోషంతో ఉన్నారని తెలిపారు. అప్పులు చేసి మరీ చదివితే ఫలితం పొందే సమయంలో పేపర్ లీకేజీ కావడం లక్షలాదిమంది నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ప్రజాసంఘాలు, తామందరూ డిమాండ్ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news