కేసీర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్..!

-

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రతిపక్ష నేత కేసీఆర్ మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. బడ్జెట్ విధాన పరంగా లేదని.. మహిళలకు, రైతులను వంచించిందని.. బడ్జెట్ లో ఒక్క పాలసీ ప్రకటించలేదని విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగం ఓ కథలా, రాజకీయ ప్రసంగంలా ఉందని.. ఇక పై ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు కేసీఆర్.

కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాజాగా మీడియా చిట్ చాట్ లో పాల్గొని మాట్లాడారు. ఏం చీల్చుతారు..? ఎవరినీ చెండాడుతారు. ఎవరినీ చీల్చుతారు.. ఎవరినీ చెండాడుతారు. అడ్డగోలు గాలి మాట్లాడుతున్నారు.  పదేళ్లు మహిళలకు రుణాలు ఇవ్వలేని కేసీఆర్.. ఇప్పుడు తాము ఇస్తామంటే గాలి మాటలు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం రైతులకు రూ.26వేల కోట్లు పెడితే.. తమ ప్రభుత్వం రూ.72వేల కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news