తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..ఎల్లుండి నుంచే దసరా సెలవులు

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఎల్లుండి నుంచే పాఠశాలలకు దసరా సెలవులు రానున్నాయి. తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు ఈసారి 14 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు అంటే మొత్తం 14 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

ఈ సారి బతుకమ్మ, దసరా పండగలకు సెలవులు కలిపి మొత్తం 14 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల అకాడమిక్ క్యాలెండర్ 2022-23 లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే.
♦️ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు (14 రోజులు).
♦️ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
♦️ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు.
♦️వేసవి సెలవులు ఏప్రిల్ 25 2023 నుంచి జూన్ 11,2023 వరకు.