కారు వర్సెస్ కమలం..ఎన్నికల పోరు మొదలు.!

-

తెలంగాణలో ఎన్నికల పోరు మొదలైంది..కరెక్టు గా మరో ఆరు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవాలని అటు బి‌ఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ లతో పాటు బి‌జే‌పి గట్టిగా ప్రయత్నిస్తుంది. అసలు ప్రస్తుతం అక్కడ ఎవరిది పై చేయి ఉందో అర్ధం కాకుండా ఉంది. ఎందుకంటే వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బి‌ఆర్‌ఎస్‌కు అంత అనుకూల వాతావరణం ఏమి లేదు.

బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఇటు వరుసగా రెండుసార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి అనుకున్న విధంగా పాజిటివ్ లేదు. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. కాకపోతే ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది..నేతలు ఉన్నారు. ఇదే సమయంలో ఊహించని విధంగా బి‌జే‌పి బలపడింది. సడన్ గా రేసులోకి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో దూకుడు మీద ఉంది. అటు కేంద్రం పెద్దలు సైతం తెలంగాణపై ఫుల్ గా ఫోకస్ పెట్టారు.

కాకపోతే బి‌జే‌పికి క్షేత్ర స్థాయిలో పూర్తిగా కార్యకర్తలు, నాయకుల బలం లేదు. అయినా సరే ఆ బలం పెంచుకోవడమే లక్ష్యంగా బి‌జే‌పి వెళుతుంది. అయితే కేంద్రం పెద్దలు పార్టీ బలాన్ని పెంచడానికి రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇటు బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎంట్రీ ఇచ్చి తెలంగాణలో రాజకీయ పరిస్తితులని మార్చేశారు. ఒక్కసారిగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఊహించని ఎత్తు వేశారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి…ఇతర వర్గాలని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇలా షా ఎన్నికల గేమ్ మొదలుపెట్టారు..దీనికి కే‌సి‌ఆర్ ఎలా చెక్ పెడతారు..అటు కాంగ్రెస్ ఎలాంటి ఎత్తులు వేస్తుందనేది చూడాలి. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల పోరు మొదలైపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version