తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ అవకాశం పొదుపు సంఘాల మహిళలకు వర్తిస్తుంది. పొదుపు సంఘాలలోని మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జనగామ జిల్లాలోని పాలకుర్తిలో ఓ మహిళకు ఎలక్ట్రిక్ ఆటోను అందించారు.
పొదుపులో ఉన్న సభ్యురాలు లేదా వారి కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ వాహనాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్త్రీనిధి రుణం నుంచి ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ఆటోలకు చార్జింగ్ పాయింట్ల కోసం అధ్యయనాలు చేస్తున్నారు.