ముగిసిన రాజ్ పాకాల విచారణ

-

జన్వాడ ఫామ్ హౌస్ లో రేవు పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల విచారణ ముగిసింది. విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దాదాపు 9 గంటల పాటు ఆయనను మోకిల పోలీసులు ప్రశ్నించారు. విచారణ మద్యలో మోకిలలోని రాజ్ పాకాల ఫఆమ్ హౌస్ లో సోదాలు చేశారు. దాదాపు గంట పాటు అక్కడ పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాలు ముగియడంతో రాజ్ పాకాలను పోలీసులు తిరిగి మోకిల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫామ్ హౌస్ మొత్తం మరోసారి తనిఖీలు చేసారు పోలీసులు.

ఆ రోజు రాత్రి ఫామ్ హౌస్ లో ఏం జరిగింది? విజయ్ మద్దూరి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాఫ్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ తీసుకున్నారా? లేక మరో చోట డ్రగ్స్ తీసుకుని ఫామ్ హౌస్ లో పార్టీకి వచ్చారా? అనేది పోలీసులు నిర్ధారించుకోవాల్సి ఉంది. విజయ్ మద్దూరి ఫోన్ లభిస్తేనే.. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. మరోవైపు ఆయన చెప్పిన స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఈ ఫామ్ హౌస్ లో గతంలో జరిగిన పార్టీలపై ఆరా తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version