పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి వరంగల్ కమిషనరేట్ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం హాజరుకావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు పోలీసులు. అయితే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉన్న నేపథ్యంలో 10వ తేదీన హాజరవుతానని చెప్పారు ఈటెల. తాజాగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు ఈటెల రాజేందర్.
తనకి నోటీసులు, జైలు కొత్త కాదని అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. కేవలం తనని వేధించడానికి ఈ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తాను టెక్నాలజీకి పెద్దగా అప్డేట్ కాలేదని, అందుకే మెసేజ్ లకు రిప్లై ఇవ్వనని చెప్పారు. ఎవరో ఓ వ్యక్తి తనకి మెసేజ్ పంపినంత మాత్రాన దాన్ని చూడకపోయినా నోటీసులు ఇచ్చారని.. కెసిఆర్ కు పోయేకాలం దాపరించిందని వ్యాఖ్యానించారు.