టిఆర్ఎస్ నేతలపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పలివేలలో పక్కా స్కెచ్ తోనే తనపై దాడి జరిగిందని అన్నారు. ఎన్ని దాడులు చేసినా బెదిరేది లేదన్నారు ఈటెల. మునుగోడు ఉప ఎన్నికలలో ఓడిపోతున్నామని సీఎం కేసీఆర్ కి అర్థమైందని.. అందుకే ఇలాంటి దాడులకు ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు కెసిఆర్ జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఎప్పుడూ లేని రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దేశంలో ఖరీదైన ఎన్నికలు ఎక్కడ అయినా జరుగుతున్నాయంటే అది తెలంగాణలో జరుగుతున్నాయని పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చాడని మండిపడ్డారు. గతంలో అటుకులు బుక్కి, ఉపవాసం ఉండి ఎన్నికలలో గెలిచామని చెప్పే కేసిఆర్.. ఇప్పుడు మాత్రం ఎన్నికలలో గెలిచేందుకు డబ్బు, మధ్యాహ్నం నమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచి నేటికీ ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. 2021 నవంబర్ 2వ తేదీన తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిన రోజుని అన్నారు. హుజరాబాద్ ఎన్నికలలో తాను గెలిచాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు దీపావళి పండుగ చేసుకున్నారని అన్నారు.