మునుగోడులో కమలానికే ప్లస్..దూకుడు తగ్గదా?

-

మునుగోడు ఉపఎన్నిక..ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉపఎన్నిక. సాధారణ ఎన్నికల ముందు జరగనున్న ఈ ఉపఎన్నికలో గెలవడానికి ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు శక్తివంచన లేకుండా కష్టపడ్డాయి..ప్రచారం చేశాయి..ఓటర్లని ఆకర్షించడానికి రకరకాల ఎత్తులతో ముందుకెళ్లారు. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ తీవ్రంగా నడిచింది..ఆఖరికి కొట్టుకునే వరకు ఆ రెండు పార్టీల కార్యకర్తలు వెళ్ళిపోయారు.

అంటే మునుగోడు ఫైట్ ఎలా నడిచిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే 3వ తేదీన ఉపఎన్నిక, 6వ తేదీన ఫలితం వస్తుంది. అంటే 6న ఎవరు గెలుస్తారో తేలిపోతుంది. అయితే ఈ ఉపఎన్నిక ప్రభావం తర్వాత జరిగే రాజకీయాలపై ఎంతవరకు ఉంటాయంటే..కొంతవరకు ఉండొచ్చని చెప్పొచ్చు. అలా అని పూర్తి స్థాయిలో ఈ ఉపఎన్నిక ప్రభావం తక్కువ. గెలిచిన పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప..ఓడిన పార్టీలపై మరీ ఎక్కువ ప్రభావం పడిపోదు.

అయితే ఇక్కడ టీఆర్ఎస్‌ పార్టీకే ఎడ్జ్ ఉందని అన్నీ సర్వేలు చెబుతున్నాయి. అలా అని బీజేపీ-కాంగ్రెస్ పార్టీలని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మిగిలిన పార్టీల విషయం పక్కన పెడితే..టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్న బీజేపీ పరిస్తితి ఎలా ఉంటుంది? అనేది పెద్ద చర్చ అయింది. గెలిస్తే..బీజేపీకి మరింత ఊపు వస్తుంది..అయితే ఒకవేళ ఓటమి పాలైన సరే..అనుకున్నంత ప్రభావం ఉండకపోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.

ఎందుకంటే మునుగోడులో బీజేపీ బలం కేవలం 10 వేల ఓట్లే. ఇక్కడ టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకే బలం ఎక్కువ. ఇక 10 వేల పైనే ఎన్ని ఓట్లు వచ్చిన అవి బీజేపీకి ప్లస్సే. సెకండ్ ప్లేస్‌లోకి వస్తే..టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఫిక్స్ అవ్వొచ్చు. అలాగే గెలిచినా, ఓడినా సరే టీఆర్ఎస్ పై పోరాటం విషయంలో ఏ మాత్రం తగ్గేదెలే అని విధంగా కమలదళం ముందుకెళ్లడానికే రెడీ అవుతుంది. ఎట్టి పరిస్తితుల్లోనూ గులాబీ పార్టీని నిలువరించడమే లక్ష్యంగా పనిచేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news