నేను ఆరోగ్యంగానే ఉన్నా – కోమటిరెడ్డి

-

తాను అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ టీవీ ఛానల్ లో వార్తలు ప్రసారం అవుతుండడం పట్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. తాను అస్వస్థతకు గురయ్యానంటూ ఓ మీడియా ఛానల్ లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టి పారేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని నివాసంలోనే ఉన్నానని.. తనకు ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లం లేదన్నారు.

తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు కోమటిరెడ్డి. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు. కాసేపటి క్రితమే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన చెల్లబోయిన ఉపేందర్ కుటుంబాన్ని కలిశానని తెలిపారు కోమటిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version