తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ వినిపించింది కేసీఆర్ సర్కార్. ఇటీవల అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సదుద్దేశంతో ఎకరాకు పదివేల పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 చొప్పున పరిహారాన్ని ఈనెల 12 నుంచి పంపిణీ చేయనున్నారు.
గత నెలలో వడగండ్ల వానల వల్ల నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నివేదికలు సమర్పించింది. దీనితో…పరిహారం పంపిణీ చేయాల్సిన తేదీని ప్రభుత్వం ప్రకటించింది. బాదిత రైతులకు 12 తారీఖు నుంచి ప్రభుత్వం పరిహారం అందజేయనుంది. అయితే… ఎకరాకు పదివేల రూపాయల చొప్పున… ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు బాధిత రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.